సెహ్వాగ్ కుమారుడికి ప్రమోషన్
05-10-2026 | 05:25am
ఢిల్లీ అండర్ 19 జట్టు కెప్టెన్‌గా ఆర్యవీర్ సెహ్వాగ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌కు(Aryaveer Sehwag) ప్రమోషన్ దక్కింది. తం డ్రి బాటలోనే దూసుకొస్తున్న ఆర్యవీర్ ఢిల్లీ అండర్ 19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలో ఆరంభమయ్యే వినూమన్కడ్ ట్రోఫీ లో ఢిల్లీ కుర్రాళ్ల జట్టును నడిపించనున్నా డు. 16 మందితో కూడిన జట్టును డీడీసీఏ తాజాగా ప్రకటించింది. ఈ టీంకు అర్నవ్ బుగ్గా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత కొంతకాలంగా ఆర్యవీర్ సెహ్వాగ్ నిలకడగా రాణిస్తున్నాడు.