8 July, 2026 | 7:58 AM

డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుందా?

19-12-2024 12:00 AM

‘మహానటి’ కీర్తి సురేశ్ పేరుకే మలయాళీ కానీ ఆమె ఎక్కువగా సినిమాలు చేసింది మాత్రం టాలీవుడ్‌లోనే. ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తీ ఈ సినిమా సక్సెస్‌తో తిరిగి చూసుకోవల్సిన అవసరం రాలేదు. ఇటీవలే తన ప్రియుడు ఆంటోని తటిల్‌తో పెళ్లిపీటలెక్కిందీ బ్యూటీ. అయితే బాలీవుడ్‌లో ఆమె తొలి చిత్రం ‘బేబీ జాన్’ వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

ఈ సినిమాకు కీర్తి తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒరిజినల్ సినిమాలోని సమంత పాత్రను ‘బేబీ జాన్’లో కీర్తి పోషించింది. వాస్తవానికి దక్షిణాదిలో ఆమె చేస్తున్న చిత్రాలకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. కానీ ‘బేబీ జాన్’కు మాత్రం రూ.4 కోట్లకు పైనే కీర్తి పారితోషికం తీసుకుందని టాక్.

ఈ సినిమాలో గ్లామర్ విషయంలోనూ కొంతమేర హద్దులు చెరిపేసిం దని ఇప్పటికే విడుదలైన పాటలను బట్టి తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలోనూ అలా చేసింది లేకపోవడంతో అప్‌డేట్స్ చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకున్నందునే కీర్తి గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనుకాడలేదని అంతా అంటున్నారు. ఈ చిత్రానికి అట్లీ నిర్మాతగా వ్యవహరించగా.. అతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించారు.