21-07-2025 12:20:14 AM
తన అందచందాలతో ఆకర్షించడమే కాకుండా నట ప్రతిభతోనూ అభిమానుల గుండెల్లో తిష్ట వేసిం ది నిధి అగర్వాల్. తొలుత బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసింది. తెలుగులో ఆమె నటించిన తొలిచిత్రం ‘సవ్యసాచి’తోపాటు ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలు ఆమె మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
స్టార్ హీరోలతో నటించినప్పటికీ నిధి అగర్వాల్‌కు అంతగా సక్సెస్ దక్కలేదన్న విమర్శ ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’లో ఆమె పాత్ర, గ్లామరస్ లుక్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ అనుకున్నంతగా ఛాన్సులు మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ టాలీవుడ్ స్టార్ పవన్‌కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో జోడీ కడుతోంది.
ఈ సినిమా జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తీరిక లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటోంది. దీంతో అంతటా ఆమె గురించే చర్చ జరుగుతోంది. నిధి అగర్వాల్ తన కెరీర్‌లో ఇప్పుడు కీలక దశలో ఉందని, పీరియాడికల్ డ్రామగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’లో నిధి పాత్ర చాలా కీలకమని, ఆమె నటనకు మంచి స్కోప్ ఉంటుందని సినీ విమర్శకులు చర్చించుకుంటున్నారు.
పవన్‌కల్యాణ్ వంటి స్టార్ హీరో సరసన నటించడం, పైగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో భాగం కావడం నిధి కెరీర్‌కు కచ్చితంగా ఒక కొత్త మలుపు అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా విజయం నిధిని స్టార్ హీరోయిన్‌ల సరసన నిలబెట్టే అవకాశం లేకపోలేదని అనుంటున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న నిధి లుక్స్ గురించి నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఆమె అందాన్ని పొగుడుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘అందా లు మొత్తం నిధిలా పెట్టుకుంద’ని, ‘ఆమె అందాన్ని ఆస్వాదించడానికైనా హరిహర వీరమల్లు చూడాల’ంటూ స్పందిస్తున్నారు. సౌందర్యారాధకులైన అభిమానుల వర్ణిస్తున్నట్టే.. నిధి అగర్వాల్‌కు సంబంధించిన గ్లామరస్ ఫొటోలు ఇప్పు డు నెట్టింట వైరల్‌గా మారాయి.