21-07-2025 12:17:22 AM
విజువల్ వండర్‌గా, శక్తిమంతమైన కథనంతో సిని మాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ప్రేక్షకుల ముం దుకు వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మహావతార్ : నరసింహ’. దర్శకుడు అశ్విన్ కుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నా రు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణ లో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. ఈ విజనరీ యాని మేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పోసే లా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్‌కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. “-మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ మహావతార్ నరసింహ. శ్రీమహావిష్ణువు దశావతారాలన్నీ లార్జర్ దెన్ లైఫ్, బిగ్ కాన్వాస్‌లో ప్రజెంట్ చేయాలని ఆలోచనతో మహావతార్ యూనివర్స్ మొదలైంది.
- యానిమేషన్‌లోనే ఈ సినిమాను నిర్మించాలని ఆలోచన మొదటి నుంచి ఉంది. శ్రీమహావిష్ణువు కథను చెప్పాలంటే యానిమేషన్ ఒక బెస్ట్ మీడియం. కొన్నిసార్లు నటులు దేవుడి పాత్రలు చేసేటప్పుడు చాలా చాలెంజింగ్‌గా ఉంటుంది. అప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడుతుంది. అందుకే ఎపిక్ కథల్ని చెప్పడానికి యానిమేషన్ బెస్ట్ మీడియం అని భావించాం.
- ప్రతి అవతారానికి ఒక విశిష్టత ఉంది. నరసింహ అవతారం నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు చాలా అవసరం. నరసింహ స్వామి రక్షకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో నరసింహ స్వామి అవతారం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నాం.
- ఇది మైథాలజీ కాదు.. మన చరిత్ర. ప్రతి జనరేషన్‌కు మన చరిత్రను చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలకు, ఈ జనరేషన్ యువతకు మన చరిత్ర తెలియజేయాలి. ఈ కథను పలు హిందూ శాస్త్రాల నుంచే తీసుకున్నాం. -ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని విజువల్స్ బిగ్‌స్క్రీన్ మీద చూడబోతున్నారు. వార్ సీక్వెన్సులన్నీ సరికొత్త అనుభూతిని పంచుతాయి. చాలా హై స్కేల్‌లో తీసిన సినిమా ఇది. విజువల్ వండర్.. పైసా వసూల్ మూవీ. అలాగే ఒక చరిత్ర, సంస్కృతి, ధర్మాన్ని అద్భుతంగా చూపించే సినిమా ఇది.
- ఒకవేళ ఈ ప్రాజెక్టును ఎవరైనా ఒక హీరోతో చేసి ఉంటే.. హిరణ్య కశ్యప పాత్ర కోసం రానా లేదా విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకునేవాళ్లం. నరసింహ పాత్ర మాత్రం యానిమేట్ చేయాల్సిందే. మా నెక్స్ట్ ప్రాజెక్ట్.. ‘మహావతార్ పరశురాం’ ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. అది కూడా చాలా పెద్ద స్కేల్‌లో ఉంటుంది.