07-06-2025 12:00:00 AM
ఇటు దక్షిణాదితోపాటు అటు బాలీవుడ్‌లోనూ వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవల సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘సికందర్’ సినిమాలో రష్మిక నటిం చగా.. అది పెద్దగా ఆడలేదు. అయినా రష్మిక జోరు తగ్గలేదు. బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్‌ను అందుకుంది. 2012లో విడుదలైన ‘కాక్‌టెయిల్’ సూపర్ హిట్‌గా నిలిచింది. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ హిందీ ప్రేక్షకులను బాగా అలరించింది.
ఒక మోడ్రన్ అమ్మాయి, ఒక ట్రెడిషినల్ లేడీ, ప్లేబాయ్ లాంటి అబ్బాయి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘కాక్‌టెయిల్ 2’ రూపొందుతోంది. ఇందులో రష్మిక కథానాయిక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తుండగా, మ్యాడ్‌లాక్ విజయన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘కాక్‌టెయిల్’లాగే ఇది కూడా ముక్కోణ పు ప్రేమకథగా తెరకెక్కనుంది. ఇందు లో కృతి సనన్ సెకండ్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షాహిద్ కపూర్ ప్లేబా య్ పాత్రలో కనిపించనున్నాడట. ఇంతకు ముందు కృతి సనన్, షాహిద్ కపూర్ కలిసి నటించగా, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. వీరిద్దరితో కలిసి రష్మిక నటించడం ఇదే మొదటిసారి.
త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. కాగా ఇప్పటికే బాలీవుడ్‌లో ‘థామ’ అనే హారర్ కామెడీ సిని మా చేస్తోంది రష్మిక. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా రష్మిక నటిస్తున్న ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముం దుకు రానున్నాయి.