28 August, 2026 | 1:59 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

అందాన్ని పెంచే ఆసనాలు

10-12-2024 12:00 AM

అందంగా కనిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే చర్మ సౌందర్యం కోసం మార్కెట్‌లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గర యోగా ఆసానాలు వేసి అందంగా మెరిసిపోవచ్చు. అందుకోసం ఏయే ఆసనాలు వేయాలో తెలుసా..

శీర్షాసనం: శీర్షాసనంలో తలకిందుగా ఉండాలి. ఒక చాప తీసుకుని, దానిపై తలకిందులుగా ఉండా లి. తల వెనుకవైపు చేతులు జోడించి ఉంచి.. కాళ్లను నిటారుగా పైకి పెట్టాలి. ఈ పొజిషన్‌లో కాసేపు ఉండి.. ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి.

హలాసనం: ఈ ఆసనం వేసే ముందు వెల్లకిలా పడుకోవాలి. అర చేతులను నేలకు స్పృశిస్తూ ఉంచాలి. ఆ తరువాత పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. అలా పాదలను తల వెనుకవైపునకు తీసుకువచ్చి.. ఛాతి గడ్డానికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఈ భంగిమలో కాసేపు ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి.

సర్వంగాసనం: ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత మీ పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. పాదాలు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. తుంటి భాగాన్ని సైతం పైకి లేపాలి. మీ అరచేతులతో సాయంతో నడుమును పైకి లేపినట్లుగా పట్టుకోవాలి. మీ భుజాలు, కాళ్లు సమానంగా ఉంచేలా ప్రయత్నించాలి. మీ దృష్టిని పాదాలపై కేంద్రీకరించాలి. అలా ఉఛ్వాస, నిశ్వాసలను సాగిస్తూ కాసేపు ఉండాలి.

ఈ ఆసనాలు వేయడం వల్ల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. చర్మం రంగు కూడా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ చర్మానికి బాగా అందుతుంది. దీనితో చర్మానికి మెరుపు వస్తుంది. ప్రతిరోజు మూడు నుంచి ఐదుసార్లు ఈ ఆసనాలను వేయడం వల్ల చర్మ ముడతలు, సాగదీత లాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు యోగా ట్రైనర్స్.