28 August, 2026 | 1:58 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి

28-08-2026 01:25 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, దివంగత కోట్నాక భీంరావు వర్ధంతిని జయప్రదం చేయాలని  రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా సర్మడి కురిసింగ మోతిరామ్, జాతీయ నాయకుడు అర్జు మాస్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29(శనివారం)న జిల్లా కేంద్రంలోని కొట్నాక భీమ్రావు(చిల్డ్రన్) పార్కులో వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆదివాసీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి భీంరావు చేసిన సేవలను స్మరించుకోనున్నారు.

గిరిజన విద్యాభివృద్ధికి ఆశ్రమ, గురుకుల, ప్రాథమిక పాఠశాలల స్థాపనతో పాటు సాంప్రదాయ రాయి సెంటర్ వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక జీవోల ద్వారా ఐటీడీఏ పరిధిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసి ఎంతోమంది ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.కోట్నాక భీంరావు సేవలను స్మరించుకునే ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తెలు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మర్వుకోల సరస్వతితో పాటు అభిమానులు, ప్రజలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతి, నర్సింగరావు, జ్ఞానేశ్వర్, బాదిరావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.