28 August, 2026 | 2:26 PM

Breaking News

ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు   •   మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం   •   పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి ఆర్థిక సహయం   •   జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •  

జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి

28-08-2026 01:22 PM

జర్నలిస్టులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి

తరిగొప్పుల, (విజయక్రాంతి): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తరిగొప్పుల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్సై గుగులోత్ శ్రీదేవి జర్నలిస్టులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీదేవి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పోలీస్, మీడియా మధ్య స్నేహ సంబంధం, పరస్పర సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి, భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రింట్ జర్నలిస్టులు పాల్గొన్నారు.