6 May, 2026 | 10:15 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ప్రభుత్వ నిర్భందాన్ని నిరసిస్తూ ఆశాల నిరసన...

10-12-2024 05:27 PM

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఆశలు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): సమస్యల పరిస్కారం కోసం శాంతి యుతంగా ఛలో హైదరాబాద్ కు వెళ్లే ఆశ కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను ఎక్కడికక్కడ నిర్బందించడాన్ని నిరసిస్తూ, ఆశాలపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహానం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు 18 వేల రూపాయల వేతనం పెంచుతామన్న హామీని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుందని విమర్శించారు. మహిళలనే కనీసం సోయి లేకుండా మగ పోలీస్ లతో కొట్టించడం అన్యాయం అన్నారు. ప్రజాపాలన అంటూ  నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ పోలీస్ లను నమ్ముకొని పరిపాలిస్తున్నదని, అలాంటి ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు అన్న సత్యాన్ని గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల చిన్నన్న, లక్ష్మి, పుష్పలత తదితరులు ఉన్నారు.