6 May, 2026 | 9:21 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

తెలంగాణ తల్లికి అవమానం

10-12-2024 05:22 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానపరిచారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ పిలుపుమేరకు జిల్లాలో పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాలకు, ఫ్లెక్సీలకు పాలభిషేకం చేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి కించపరచారాని ఆరోపించారు. కేవలం సోనియాగాంధీ మెప్పు కోసమే కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాంస్కృతిక చిన్నహాలను మార్చే కుట్ర చేస్తుందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువరి వెంకటేశ్వర్లు, నాయకులు గంధం శ్రీనివాస్, భీమేష్, రవి, సాజిద్, అన్సర్, హైమద్, ని సార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.