17 March, 2026 | 3:16 PM

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు

17-03-2026 01:33 PM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 

వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని ఆశ వర్కర్ల ఆవేదన 

కామారెడ్డి,(విజయక్రాంతి): వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు(Asha Workers Protest) చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్(Kamareddy Collectorate) ముట్టడి కార్యక్రమాన్ని ఆశా కార్యకర్తలు నిర్వహించారు. కలెక్టరేట్ లోకి వెళ్లకుండా పోలీసులు ఆశ కార్యకర్తలను అడ్డుకున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ(CPM Party) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు మద్దతు ప్రకటించారు. పోలీసులకు ఆశా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సిపిఎం నాయకుడు చంద్ర శేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆశా కార్యకర్తలను సైతం అడ్డుకొని అరెస్టు చేశారు.