ఆషాఢం నంబర్ 1 కిలో సేల్
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ప్రారంభం
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): సౌత్ ఇండియా షా పింగ్ మాల్ 15వ ఆషా ఢం నంబర్ 1 కిలో సేల్ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి అమ్మ కాలు ఆరంభించింది. 66% వరకు తగ్గింపుతో గార్మెంట్స్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆషాఢం షాపింగ్ కిలోల్లో... సంతోషం టన్నుల్లో నినాదంతో సరికొత్త షాపింగ్ అనుభూతిని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ తన ఆత్మీయ కొనుగో లుదారుల కోసం సిద్ధం చేసింది.
మహిళలకు ఆశ్చర్యం గొలిపే సంప్రదాయాన్ని ప్రతిబింబించే పట్టుచీరెలు, డిజైనర్ చీరలు, అద్భుతమైన లెహంగాలు ఉన్నాయి. పురుషుల కోసం షార్ప్ ఎత్నిక్ వేర్, స్టైలిష్ షేర్వాణీలు, స్మార్ట్ కాజువల్స్, లేటెస్ట్ ట్రెండింగ్ ఔట్-ఫిట్స్ కొలువు దీరాయి. పిల్లల కోసం కళ్ళు మిరుమిట్లు గొలిపే ఎత్నిక్ వేర్, అనేక రకాల కంఫర్టబుల్ క్యాజువల్స్ అలరిస్తున్నాయి.






