చరిత్ర సృష్టించిన ఆశిశ్ యాదవ్
- అండర్ 20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం
- పదేళ్ల తర్వాత జావెలిన్ త్రోలో పతకం
యూఎస్‌ఏ, ఆగస్టు 8 : భారత యువ అథ్లెట్ ఆశిశ్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అమెరికాలో జరుగుతున్న అండర్ 20 వరల్డ్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో రజతం గెలుచుకున్నాడు. తద్వారా ఈ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా తర్వాత మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. పదేళ్ల క్రితం ఇవే పోటీల్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. ఇప్పుడు ఆశిశ్ రజ తం గెలిచి నీరజ్ సరసన నిలిచాడు.19 ఏళ్ల ఆశిశ్ తీవ్ర పోటీ మధ్య మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హెడ్రిక్ హైమన్స్ 80.50 మీటర్ల దూరం జావెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆశిశ్ 74.09 మీ.తో రెండో స్థా నంలో నిలిచి రజతం సాధించాడు. డొమినికాకు చెందిన అడ్డిసన్ జేమ్స్ 73.89 మీ. విసిరి మూడో స్థానంతో కాంస్యం అందుకొన్నాడు. యాదవ్‌కు తొలి నుంచీ గట్టి పోటీనే ఎదురైంది. మొదటి రౌండ్లో 69.96 మీ. విసిరాడు. మూడో త్రోలో 74.09 మీ. విసిరి తన సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. ఓ అంతర్జాతీయ వేదికపై జూనియర్ స్థాయిలో అతనికి ఇదే తొలి పతకం.






