9 August, 2026 | 1:33 AM

కొరియా మాస్టర్స్ ఫైనల్లో అస్మిత

09-08-2026 12:00 AM
  1. సెమీస్‌లో రక్షితపై విజయం
  2. చైనా ప్లేయర్ హాన్‌తో టైటిల్ పోరు

అసన్ సిటీ, ఆగస్టు 8 : భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం అస్మిత చలిహా కొరియా మాస్టర్స్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో అస్మిత 21 16 స్కోరుతో మన దేశానికే చెందిన రక్షిత రామరాజ్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అస్మిత తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో గేమ్‌లో రక్షిత అద్భుతంగా పుంజుకుని స్కోరు సమం చేసింది.

క నిర్ణయాత్మక మూడో గేమ్ తొలి అర్ధభాగం వరకూ ఇద్దరి మధ్య గట్టిపోటీ సాగింది. కానీ చివర్లో అస్మిత దూకుడుగా ఆడి రక్షితపై ఆధిపత్యం కనబరిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గాయంతో మూడు నెలల పాటు ఆటకు దూరమైన ఈ భారత షట్లర్ ఇటీవలే మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో చైనాకు చెందిన కియాన్సి హాన్ గెలుపొందింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో హాన్ 22 స్కోరుతో కొరియా క్రీడాకారిణి గ్రేస్ కిమ్‌ను ఓడించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో అస్మిత, హాన్ తలపడనున్నారు.