1 March, 2026 | 9:18 PM

నేత్ర దానంతో మరణించి జీవించిన అశోక్ కుమార్

01-03-2026 06:59 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ బస్తి నివాసి నేత్రదాత దాత దివంగత బింగి అశోక్ కుమార్ సంస్మరణ సభ స్థానిక  పద్మశాలి భవన్ లో జనహిత సేవా సమితి, సదాశయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సదశయా ఫౌండేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి హాజరై నేత్రదాత బింగి అశోక్ కుమార్ చిత్రపటానికి నివాళి నివాళులర్పించారు.

నేత్రదాత బింగి అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు భార్య బింగి రాజ కుమారి, తల్లి బింగి వెంకమ్మ, కుమారులు కొడళ్ళు బింగి శ్రావణ్ కుమార్-తేజస్విని, బింగి సంతోష్ కుమార్-మౌనిక కుటుంబ సభ్యులని అభినందించి ప్రశాంస పత్రం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి  మాట్లాడుతూ ప్రతి మనిషికి మరణం తప్పదని జీవించినపుడు ఇతరులకి సహాయపడాలని బింగి అశోక్ కుమార్ నేత్రదానం ద్వారా మరణించిన జీవిస్తూ వారి నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నారన్నారు. వారి స్పూర్తితో మరింత మంది నేత్ర అవయవ దానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్  మాట్లాడుతూ నేత్రదాత బింగి అశోక్ కుమార్ కుటుంబ సభ్యుల స్ఫూర్తితో నేత్ర, అవయవ, శరీరాలు వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు బిరా మురళి, బింగి సత్యనారాయణ, బింగిపోశం, సామాజిక కార్యకర్త గజేల్లి మోహన్, జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి,ఉపాధ్యక్షులు హనుమాండ్ల రమాదేవి, కందుల రాజన్న, కార్యవర్గ సభ్యులు డోలి సుకుమార్ బంధు మిత్రులు, పాల్గొన్నారు.