8 July, 2026 | 3:37 PM

వాహన ధరల్ని పెంచుతున్న అశోక్ లేలాండ్

14-12-2024 12:03 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఇతర ఆటోమొబైల్ కంపెనీల బాటలోనే హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ సైతం ధరల్ని పెం చేందుకు సిద్ధమయ్యింది. తమ వాణిజ్య వాహనాల ధరల్ని జనవరి నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు అశోక్ లేలాండ్ శుక్రవారం తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరి గిన కమోడిటీ వ్యయాల కారణంగా తమ అన్ని వాణిజ్య వాహనాలూ పెరుగుతాయని, మోడల్, వేరియంట్‌నుబట్టి ధరల పెరుగుదల ఉంటుందని కంపెనీ తెలిపింది.