తగ్గిన బంగారం
హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ మార్కెట్లో భారీగా తగ్గిన కారణంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం తిరిగి రూ.79,000 దిగువకు తగ్గింది. ఈ వారం ప్రారంభంలో వరుసగా పెరిగిన పుత్తడి అంతర్జాతీయ మార్కెట్లో గురువా రం రాత్రి 40 డాలర్లు, శుక్రవారం మరో 15 డాలర్లు పడిపోయింది. దీనితో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గుదలతో రూ. 78,870 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగా రం 10 గ్రాముల ధర రూ.550 క్షీణించి రూ.72,300 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర భారీగా 55 డాలర్లుపైగా పెరిగి 2,675 డాలర్ల స్థాయికి పడిపోయింది.
ఇందుకు అనుగుణంగా శుక్రవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్ రూ.77,200 స్థాయి వద్ద కదులుతున్నది. యూఎస్ ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా వెలువడినందున, బంగారం ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ధర క్షీణించిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.
రూ.3,000 క్షీణించిన వెండి
బంగారం బాటలోనే మరో విలువైన లోహం వెండి ధర సైతం క్షీణించింది. కేజీ ధర ఒక్కసారిగా రూ.3,000 తగ్గి రూ. 1,01,000 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కె ట్లో ఔన్సు వెండి ఫ్యూచర్ ధర 3శాతంపైగా తగ్గి 30.90 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.




