దక్షిణ మధ్య క్షేత్ర పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థుల ఎంపిక
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా ముథోల్‌లో ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌లో ఆసిఫాబాద్(Asifabad) శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం(English Medium) పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.సంస్కృతి బోధ పరియోజన క్విజ్ బాలవర్గం విభాగంలో 7వ తరగతి విద్యార్థి చిప్ప సుధీక్ష, 6వ తరగతి విద్యార్థి గుత్తి విక్రమ్, 8వ తరగతి విద్యార్థి గాండ్రటి హరిచరణ్ పాల్గొని ప్రథమ స్థానం సాధించారు.
విజేతలకు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో విజయవాడలోని నూతక్కిలో జరిగే దక్షిణ మధ్య క్షేత్రస్థాయి పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడనున్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను పాఠశాల ఆచార్యులు, ప్రబంధకారిణి సభ్యులు అభినందించి, దక్షిణ మధ్య క్షేత్ర పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.






