6 March, 2026 | 11:00 AM

తైక్వాండో ఛాంపియన్‌షిప్ సాధించిన గొంది హనుమంత్‌ను అభినందించిన ఏ.ఎస్.పి

06-03-2026 01:58 AM

వెంకటాపురం(నూగూరు), మార్చి 5(విజయక్రాంతి): సెకండ్ ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ కాంపిటీషన్ ఫిబ్రవరి 7,8 తేదీలలో హైదరాబాదులోని మియాపూర్ లో నిర్వహించారు. ఆ కాంపిటీషన్లో గొంది హనుమంత్ కుమిటీ విభాగం లో గోల్ మెడల్ సాధించటం జరిగింది.

గురువారం కాఫెడ్ గ్రౌండ్ లో జరిగిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో గోల్ మెడల్ సాధించిన గొంది హనుమంత్ కు ఎ.ఎస్.పి అభినందనలు తెలియచేశారు. గత 6 సంవత్సరాలు గా వెంకటాపురం, వాజేడు మండలంలోని ఆడ పిల్లలకు ఫ్రీ కోచింగ్ ఇస్తూ వారికి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ హనుమంతు ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఇలాంటి కోచింగ్ లు ఇవ్వటం ఎంతో మంచి విషయం అని చెప్పారు. గోల్ మెడల్ సాధించినహనుమంతును ఆయన శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ఎస్త్స్ర తిరుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.