6 March, 2026 | 12:39 PM

రాజ్యసభకు ‘వేం’ ఎంపిక పట్ల మానుకోటలో హర్షాతిరేకాలు

06-03-2026 01:57 AM

మహబూబాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం పట్ల మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా ప రిధిలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాకులు కాల్చి, సీట్లు తినిపించుకొని వేడుకలు నిర్వహించారు. వేం నరేం దర్ రెడ్డి స్వగ్రామమైన అర్పణపల్లి తోపాటు కేసముద్రం మండలంలోని వివిధ గ్రామా ల్లో సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నా రు. అలాగే గూడూరు, ఇనుగుర్తి, నెల్లికుదురు తదితర మండలాల్లో కూడా సంబరా లు నిర్వహించారు.