19-01-2026 12:00:00 AM
మరిపెడ, జనవరి 18 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర బిజెపి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, 12 ఏళ్లుగా ప్రజాధనాన్ని కా ర్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోందని, కార్మికులు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా అనేక సంస్కరణలను అమలు చే స్తుందని, వీటిని సంఘటితంగా తిప్పి కొట్టాలని ఏఐఏడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అ ల్వాల వీరయ్య పిలుపునిచ్చారు. కార్మిక ప్ర జా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర ఆదివారం మరిపెడలో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ సంస్థలకు వరాలజల్లు కురిపిస్తుందని ఆరోపించారు.
కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కో డ్లను మార్చారని, వ్యవసాయ కూలీలకు ఉ పాధి దూరం చేసేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను సంఘటితంగా వ్యతిరేకించాలని, ఇందుకోసం మహా ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు గుణగం టి రాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు కందాల ర మేష్ జిల్లా ఉపాధ్యక్షులు, సుధాకర్, సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు, కొండ ఉప్పల య్య నందిపాటి వెంకన్న ఏఐఏ డబ్ల్యూ, జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న, జిల్లా నాయకులు, గుండ గాని మధుసూదన్, కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చన్న, కేజీ కేఎస్ జిల్లా నాయకులు బోడపట్ల రాజశేఖర్, గంధసిరి మహేష్, ఐద్వా మండల కార్యదర్శి దొంతు మమత, షరీఫ్, వైయస్ సురేష్ వడ్లకొండ ఉప్పలయ్య, ఇమామ్ సాబ్, పల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.