తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్
తమిళనాడులో ఉదయం 9 వరకు 17.69 శాతం పోలింగ్
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Tamil Nadu Assembly Elections) కొనసాగుతోంది. తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు 17.69 పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల ప్రారంభమైన పొలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తోంది. 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడుతలో పోలింగ్ జరుగుతోంది. 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 4,023 మంది అభ్యర్థులు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తమిళనాడు, తెలంగాణ సహా దేశవ్యాప్త రాజకీయ వార్తలు తెలుగులో చదవడానికి మా పొలిటిక్స్ విభాగం follow చేయండి.
డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్, ఎన్డీయే మధ్య పోటీ జరుగుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. తమిళనాడులో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాలెం ప్రాంతంలో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఓటేశారు.
తమిళనాడు ఎన్నికల తాజా అప్‌డేట్లు, పోలింగ్ శాతాలు నిమిషాల వ్యవధిలో తెలుసుకోవడానికి విజయక్రాంతి హోమ్‌పేజ్ సందర్శించండి.






