calender_icon.png 23 August, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

05-12-2024 02:20:57 AM

నోటిఫికేషన్ జారీచేసిన 

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై  అదే రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

ఈ సమావేశాల్లోనే పలు బిల్లులపై చర్చించనున్నారు. ప్రధానంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను భూమాతగా పేరు మార్చాలని నిర్ణయించింది. ధరణిలోకి కొన్ని అంశాలకు కూడా ప్రభుత్వం సవరణలు చేయనుంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

ప్రస్తుతం ముగ్గురు సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ముగ్గురు సంతానం ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా సమావేశాల్లో సవరించే అవకాశం ఉందని సమాచారం. మూసీ పునర్జీవనం, హైడ్రాతో పాటు మరికొన్ని అంశాలపై సభలో చర్చించి ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది.