బేగంబజార్‌లో దారుణం
భార్య, కొడుకును చంపి తాను సూసైడ్ చేసుకున్న వ్యక్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (విజయక్రాంతి): భార్యను, కొడుకును హత్య చేసిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసిన పెద్ద కొడుకు భయంతో పరారైన ఘటన బేగంబజార్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల యూపీకి మహమ్మద్ సిరాజ్ ఆరేళ్ల కింద నగరానికి వచ్చి బేగంబజార్ తోప్‌ఖానాలో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
భార్యపై అనుమానం ఉన్న సిరాజ్ కొన్నాళ్లుగా తరుచూ ఆమెతో గొడవలు పడుతు న్నారు. గురువారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో సిరాజ్ తన భార్య గొంతు కోసి, చిన్న కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. తల్లిని, తమ్ముడినీ హత్య చేస్తున్న దృశ్యాన్ని కళ్లారా చూసినా పెద్ద కుమారుడు అమెజాన్ అక్కడి నుంచి పారిపోయాడు.
అనంతరం సిరాజ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






