8 April, 2026 | 3:30 AM

ఏసీబీ వలలో అసోసియేట్ డీన్

08-04-2026 01:47 AM
  1. విత్తన సంస్థ ఏర్పాటు కోసం లక్ష డిమాండ్
  2. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
  3. కార్యాలయం, ఇంటిలో సోదాలు
  4. కీలక పత్రాలు స్వాధీనం

రాజేంద్రనగర్, ఏప్రిల్ 7: ఏసీబీ మరో అవినీతి అధికారి గుట్టురట్టు చేసింది. ఈసారి యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఏసీబీ వలకు చిక్కాడు. విత్తనాల సంస్థ ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ ఇప్పిస్తానని ఒక ప్రైవేట్ విత్తన సంస్థ ప్రతినిధి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటూ అగ్రికల్చరల్ కాలేజీ అసోసియేట్ డీన్ రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి విత్తన సంస్థ ఏర్పాటుకు 2025 మార్చిలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాడు.

నెలలు గడుస్తున్నా లైసెన్స్ రాకపోవడంతో రాజేంద్రనగర్‌లోని అగ్రి కల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్‌ను ఆశ్రయించాడు. తనకున్న పరిచయాలతో విత్తన కార్పొరే షన్‌లో మాట్లా డి లైసెన్స్ ఇప్పిస్తానని, భవిష్యత్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని గోవర్ధన్ నమ్మబలికాడు. ఇందుకు ప్రతిఫలం గా లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించాడు.

వారి సూచన మేరకు మంగళవారం రాజేంద్రనగర్‌లోని కార్యాలయం లో గోవర్ధన్ సదరు బాధితుడి నుంచి నగ దు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్నట్లు శాస్త్రీ య ఆధారాల ద్వారా నిర్ధారించారు. గోవర్ధన్‌ను అరెస్టు చేసిన అధికారులు రాజేం ద్రనగర్ కార్యాలయం, ఎల్బీనగర్‌లోని నివాసంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

ఈ సోదాల్లో కీలకపత్రాలను స్వాధీ నం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.