8 April, 2026 | 3:33 AM

విద్యాకమిషన్ నివేదికపై అభిప్రాయాలు తీసుకోవాలి: టీఆర్టీఎఫ్

08-04-2026 01:47 AM

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలకు సం బంధించి చేసిన ప్రతిపాదనలు తెలంగాణ విద్యాకమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు.

ఈ మేరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ కే.కేశవరావుని కలిసి కమిషన్ నివేదికపై అభ్యంతరాలను సమర్పించినట్లు పేర్కొన్నారు. సర్వీసు నిబంధనలు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులను ఐదేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం, ప్రతి ఐదేళ్లకోసారి పరీక్షలు నిర్వహించడం లాంటి అంశాలు ఉపాధ్యాయులను తీవ్ర అభద్రతా భావానికి గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.