22 July, 2026 | 10:06 AM

ద్వాదశ రాశిఫలాలు

30-06-2024 03:00 AM

30-.6.--2024 నుండి 6-.7.-2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం:-

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. శుభ వార్తలు వింటారు. యువతీ యువకులకు ఉన్నత ఉద్యోగాలు, మంచి సం బంధాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభం, ప్రమోషన్లు కలుగుతాయి. స్థాన చలనాలు ఉంటాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ఉన్నతిని పొందుతారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం: 

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాలో ఆటంకాలు కలిగినప్పటికినీ విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తు లకు అధికారులతో ఒత్తిళ్లు పెరిగినా శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకులు పడతారు. విదేశీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. రైతులకు లాభాలు ఉండవు.- ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. కొంత మానసిక అధైర్యం కలుగుతుంది. అధిక ధనవ్యయం అవుతుంది. బంధువులు, మిత్రులతో స్పర్ధలు ఏర్పడతా యి. యువతీ యువకులకు వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులలో ముం దుంటారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో జాగ్రత్త పడాలి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. శుభ కార్యక్రమ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరితో ఆనందంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. తీసుకొనే నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు ఏర్పడతా యి. యువతీ యువకులకు ఉద్యోగ-, వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటా యి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతా యి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో పరిచయాలు కలుగుతాయి. సహనంతో పని చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. యువతీ యువకులకు కోరుకున్నవారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు క్రయ విక్రయాలలో సామాన్య లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

తుల:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో స్పర్ధలు ఏర్పడతాయి. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి. యువతీ యువకులకు వివాహ విషయాలలో స్తబ్దత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆరోగ్యం విషయమై కొంత జాగ్రత్త అవసరం. ధనవ్యయం అవుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రమానంతర ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్లకు లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు:-

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. -విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం:--

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం కలుగుతుంది.- విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులతో జాగ్రత్త అవసరం. ధన వ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వుంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.