బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాలు పొందిన జ్యోతిష్మతి విద్యార్థులు
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం శివారులోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల(Jyothishmathi Institute of Technology and Science College) విద్యార్థులు బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. విద్యార్థులు సంవత్సరానికి 52 లక్షలు, 19 లక్షలు, 16.85 లక్షలు, 12.30 లక్షలు, 9 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు, 3.50 లక్షల చొప్పున ఎన్విడియా, క్యాడన్స్, క్వాల్కమ్, టార్గెట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్, టిసిఎస్ వంటి బహుళ జాతి సాంకేతిక సంస్థలలో ఉద్యోగాలను పొందారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు(College Chairman Juvvadi Sagar Rao) తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ తో పాటు సెక్రెటరీ, కరస్పాండెంట్ జవ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ డాక్టర్ పికే వైశాలి, విభాగాధిపతులు, అధ్యాపక బృందం అభినందించారు.






