రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు
28-08-2026 07:29 PM
ఘట్‌కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుశాపూర్‌లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 26, 27 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరిగిన 12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ సౌత్ జోన్ పోటీల్లో తేజశ్రీ జావెలిన్ త్రోలో బంగారు పతకం, సౌమ్య 3000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ తెలిపారు. ఈసందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేస్తూ, క్రీడాకారిణుల విజయంపై అభినందనలు తెలిపారు. విజేతలను ఉపాధ్యాయ బృందం, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి తదితరులు అభినందించారు.






