28 August, 2026 | 8:29 PM

మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు

28-08-2026 07:25 PM

కామారెడ్డి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నూలు పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం మార్కండేయ సమేత ఉమామహేశ్వరలకు కుంబాభిషేకం గణపతి పూజ స్వస్తి పుణ్యవచనం అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు .అనంతరం యజ్ఞోపవీతరణ పూర్ణాహుతి కార్యక్రమాలను జరిపారు సాయంత్రం మార్కండేయ స్వామి ఉమామహేశ్వర్ల ఊరేగింపు కార్యక్రమం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు అందే గణేష్, పట్టణ అధ్యక్షుడు మేక నాగరాజ్, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, క్యాషియర్ గణేష్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధ రాములు, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, బీసు సతీష్, ఐరేని రాజేందర్ లత, సంఘం ప్రతినిధులు సిరిమల్లె రాజు, అవధూత సహదేవ్, అందే నాగభూషణం, సుంచు రాములు, తదితరులు పాల్గొన్నారు.