20-08-2025 01:49:54 PM
ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి... తల్లి ఆత్మహత్యాయత్నం
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే చిన్నారుల ఊపిరి తీసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్(Bachupally Police Station) పరిధిలో దారుణం జరిగింది. లక్ష్మీ అనే మహిళ తన ఎనిమిది నెలలు, మూడేళ్ళ వయస్సున్న ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు ఉన్న సంపులో పడేసింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న బాచుపల్లి పోలీసులు.. ఇద్దరు చిన్నారులను వెలికతీయగా మృతి చెందినట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లక్ష్మికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.