20-08-2025 01:53:00 PM
జిల్లా చైర్మన్ మల్లెపూల నర్సయ్య..
బోథ్ (విజయక్రాంతి): నూతనంగా ఏర్పడిన సోనాల మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనీ ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ విన్నపం మేరకు బుధవారం సోనాల మండలంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య(District Library Chairman Mallepula Narsaiah) పర్యటించారు. గ్రంథాలయ ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ, తొందర్లోనే నిధులు కేటాయించి సోనాల మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్ నాయకులు పోతన్న, రమేష్, పోశెట్టి, భోజన్న, అమృత్ , అనిల్, వినోద్, ఇసృ పటేల్, రాము, బాపూరావు, మాధవరావు పటేల్, రాందాస్, గంగాధర్, చెట్ల పెళ్లి సుదీర్, జ్ఞానేశ్వర్, ముండే శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.