18 July, 2026 | 4:06 PM

యూపీలో దారుణం

16-12-2024 12:00 AM
  • బాలికల హిజాబ్ తొలగింపునకు యత్నం
  • నిందితుడి అరెస్ట్

మీరట్, డిసెంబర్ 15: ఉత్తరప్రదేశలో దారుణం చోటుచేసుకుంది. యువకుడితో ముస్లిం బాలికలు మాట్లాడారని ఓ  వ్యక్తి మరికొందరి తో కలిసి ఆమె హిజాబ్ తొలగించేందుకు యత్నించాడు. పోలీసులు నిందితుడు  మహ్మద్ మెహతాబ్ (38)ను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహరాన్‌పూర్ జిల్లా దేవ్‌బంద్‌కు చెందిన బాలిక తన చెల్లెలితో కలిసి ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో బైక్‌పై వెళుతోన్న ఓ యువకుడు ఫలానా బజార్‌కు ఎలా వెళ్లాలి?.. అని బాలికలను అడిగాడు.

ఈ  సమయంలో మెహతాబ్‌తో పాటు మరికొందరు గుర్తుతెలియని దుండగులు అక్కడికి వచ్చి ‘మీరు హిందూ యువకుడితో మాట్లాడుతున్నారు’ అంటూ బాలికలు ధరించిన హిజాబ్‌ను తొలగించేందుకు యత్నించారు. వారిపై దాడి చేశారు. ఆ యువతితో మాట్లాడిన వ్యక్తి హిందు వు కాదని తెలుసుకున్న దుండగులు ఆ తరువాత వారిని వెళ్లిపోయారు. బాలికలు తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై రూరల్ ఎస్పీ సాగర్ మాట్లాడుతూ వీడియో ఆధారంగా నిందితుడైన మెహతాబ్‌ను అరెస్ట చేశామని, మిగిలిన వ్యక్తులను పట్టుకోవడానికి గాలిస్తున్నామన్నారు. అక్కడే ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది.