18 July, 2026 | 3:37 PM

సర్ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ కొలగాని

18-07-2026 03:36 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగర మేయర్  కొలగాని శ్రీనివాస్  శనివారం తన క్యాంపు కార్యాలయంలో 67వ బూత్‌కు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్  సమక్షంలో SIR ఫారంలో తన వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం నమోదైన వివరాలను డిజిటల్ విధానంలో ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని ప్రతి అర్హత ఓటరు సద్వినియోగం చేసుకోవాలని, తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకొని ఓటరు జాబితాను తప్పులులేని విధంగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 67వ బూత్ BLOతో పాటు GPO పరశురాములు, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.