18 July, 2026 | 4:21 PM

Breaking News

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •  

పార్లమెంట్‌ను తవ్వితే.. దొరికింది నాది అవుతుందా?

16-12-2024 12:06 AM
  • వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి కేంద్రం యత్నం
  • ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో 500 ఏళ్ల క్రితం మసీదు ఉందా అని అడుగు తున్నారు.. ఒకవేళ పార్లమెంట్ కింద నేను తవ్వితే అక్కడ దొరికేది నాది అవుతుందా అని కేంద్రాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శనివారం లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొన్ని మసీ దుల్లో సర్వే చేయాలని, కొన్నింటిని కూల్చివే యాలని  కొందరు పిలుపునివ్వడంపై ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు.

వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ దేశంలో మైనార్టీలకు అధికారం పంచడానికి ఎవరూ ఇష్టపడడం లేదని 75 ఏళ్ల క్రితం అంబేద్కర్ చెప్పిన మాట ఇప్పటికీ నిజమని ఆయన అన్నారు. ఆర్టికల్ 15,16 కింద రిజర్వేషన్లు కల్పించినా మతం పేరు చెప్పి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 

మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించే హక్కును ఆర్టికల్ 26 ఇస్తుందన్నారు. హిందుత్వ జాతీయ వాదాన్ని ప్రజలపై బీజేపీ రుద్దుతోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం సూచించిన విధంగా వితంతవులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి వినియోగించా లన్నారు.