18 July, 2026 | 3:38 PM

పాముకాటుతో 9వ తరగతి విద్యార్థి మృతి

18-07-2026 03:38 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం భాగీర్తిపల్లి గ్రామంలో పాముకాటుతో 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గొండ్ల నరసింహులు కుమారుడు నవీన్ శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నవీన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.