calender_icon.png 1 February, 2026 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ విచారణకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

01-02-2026 07:32:49 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, నాయకులు ఎగుమామిడి రమణారెడ్డి, అంకారపు రవీందర్, కందుకూరి రామ గౌడ్, టౌన్ యూత్ అధ్యక్షుడు ఎగుర్ల కనకరాజు, ఎండి హమీద్, తేంబర వేణి శ్రీనివాస్, వెంగళ రమేష్, మామిడాల విజయ్ పాల్గొన్నారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో విచారణ చేపట్టారని, వెంటనే ఈ చర్యలను విరమించాలని నాయకులు డిమాండ్ చేశారు.