వల్లభనేని వంశీ ఇంటిపై దాడి
07-06-2024 06:37 PM
అమరావతి : గన్నవరం మాజీ ఎంఎల్ఎ వల్లభనేని వల్లభనేని వంశీ మోహన్ ఇంటిపై శుక్రవారం టీడీపీ నేతలు దాడి చేశారు. వియవాడ గాయత్రి నగర్ లోని వల్లభనేని వంశీ ఉంటున్న ఇంటిపై రాళ్లు విసిరి, పార్కింగ్ లో ఉన్న ఆయన కారుపైకి ఎక్కి వంశీ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమపై అక్రమ కేసులు బనాయించవంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నారా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల రంగ ప్రవేశం చేసి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి, వంశీ ఇంటి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు మోహరించారు.






