22 July, 2026 | 11:03 AM

కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీయే నేతలు

07-06-2024 05:49 PM

న్యూఢిల్లీ : ఎన్డీఏ మిత్ర పక్ష నేతలు కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు. ఎన్డీయేకు మద్దతిస్తూ నూతనంగా ఎంపికైన ఎంపీల జాబితాతను రాష్ట్రపతికి ఇచ్చి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని ఆహ్వానించాలని ఎన్డీయే మిత్రపక్షలు భావిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులతో దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్డీయే కూటమి అగ్రనేతలు పాత పార్లమెంట్ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, కుమారస్వామితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.