15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన వారిని శిక్షించాలి

08-02-2026 07:36 PM

భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్

కోనరావుపేట,(విజయక్రాంతి): రామచంద్రాపూరం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహనీయుడు జ్యోతిరావు పూలే విగ్రహంపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడిని నిరసిస్తూ కోనరావుపేట మండల సుద్దాల గ్రామంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రామచంద్రాపూరం మండలంలో తెల్లాపూర్ గ్రామంలో పూలే విగ్రహాన్ని తొలగించి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ మతోన్మాద గుండాలు పోలీసుల సమక్షంలోనే జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేయడం సిగ్గు చేటు అని ఈ దాడి మహనీయుని విగ్రహంపై కాదు దేశంలోనీ ఎస్సి, ఎస్టీ బీసీ సమాజం పైనే దాడి జరిగిందిగా చూడాలని అన్నారు.

ఆర్ఎస్ఎస్ గుండాలకు మహాత్మ జ్యోతిరావు పూలేపై ఎందుకు ఇంత ఓర్వలేని తనం అని అన్నారు. మహత్మా జ్యోతిరావు ఫూలే ఈ దేశం లో బ్రాహ్మనిజం నిర్మించిన అసమానతలపై పోరాటం చేయడం జరిగిందని అన్నారు. స్త్రీలకు విద్య అందించడం, వితంతు వివాహాలు జరపడం, అంటరానితనాన్ని నిర్మూలించడం,వంటి సమాజంలో ఉన్న ఆసమనతలపై  సమానత్వం కోసం శ్రమిచడని అన్నారు. ఇది ఓర్వలేకనే ఆర్ఆర్ఎస్ మతోన్మాదులు ఆయన విగ్రహాలపై దాడులు చేస్తున్నారు.

అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు ను తమవానిగా చెప్పుకుంటూ చరిత్ర వక్రీకరణ చేస్తున్నారని అన్నారు.అసలు ఆర్ఎస్ఎస్ సాంఘ్ వంటి వారు ఎప్పుడైనా శివాజీ జయంతులను చేశారో లేదో ఒక్కసారి తమ చరిత్ర ను తెలుసుకోవాలని హెచ్చరించారు.అసలు చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. చత్రపతి శివాజీ మహారాజ్ మతానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదని, అతను బ్రిటిష్ రాజ్యాన్ని నుండి మొఘల్ సామ్రాజ్యాన్ని నుండి తన రాజ్యాన్ని రక్షించేందుకు యుద్ధం చేసి విజయం సాధించింది.

తన రాజ్యాన్నికి పాలకుడు అయ్యాడని అన్నారు. ఆ రోజు అతనికి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించిన బ్రాహ్మణులు ఈరోజు శివాజీ మా వాడు అని చెప్పు కోవటం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్ గుండాలు మహనీయుల చరిత్ర తప్పుదోవ పట్టేలా చేస్తున్నా ప్రయత్నాలను ఆపకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు ,శీను , అజయ్,కిరణ్ సన్నీ, రోషన్ , ప్రసన్న కుమార్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.