25 March, 2026 | 5:38 AM

ఐదేళ్ల బాలుడి అపహరణకు యత్నం

05-08-2024 11:43 AM

బాలున్ని గోనె సంచిలో వేసిన వైనం 

జగిత్యాల : ఐదేళ్ళ బాలుడిని అపహరించేందుకు ప్రయత్నించిన గుర్తుతెలియని వ్యక్తిని స్థానికులు, బాలుడు తండ్రి పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణ హజారీ కాలనీలో చోటుచేసుకుంది.  ఓ ఐదేళ్ల బాలుడు ఇంటిముందు ఆడుకొంటుండగా చెత్త ఎరుకునే  ఓ గుర్తు తెలియని వ్యక్తి గోనె సంచితో వచ్చి అపహరించేందుకు యత్నించాడు. బాలుడి తండ్రి గుర్తించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.