17 April, 2026 | 3:08 PM

ఎప్‌సెట్‌కు 94.28 శాతం హాజరు

03-05-2025 01:59 AM

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి):  ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ ప్రవేశాల కోసం జరుగుతు న్న ఎప్‌సెట్‌కు శుక్రవారం రెండు సెషన్లు కలిపి 94.28 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 34, 618మంది విద్యార్థులు (93. 46శాతం) హాజరవ్వగా.. 2,423 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 35,040 మంది (94.28శాతం) పరీక్ష రాయ గా.. 2,124 మంది విద్యార్థులు డుమ్మాకొట్టారు.నల్లగొండ జోన్‌లో అత్యధికంగా 99.5శాతం, సత్తుపల్లి జోన్‌లో అత్యల్పంగా 91.1శాతం మంది పరీక్షలు రాశారు.