17 April, 2026 | 4:32 PM

అప్పు ఎగ్గొట్టేందుకు మహిళ దారుణ హత్య

03-05-2025 01:57 AM

48 గంటల్లోనే  కేసునుఛేదించిన పోలీసులు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, మే 02,(విజయ క్రాంతి): బెయిల్ కోసం అప్పిచ్చిన పాపానికి అప్పు ఎగ్గగొట్టేందుకు మహిళను దారుణ హత్య పాల్పడిన వ్యక్తిని 48 గంటల్లో పోలీసులు హత్య కేసును చేదించి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

శుక్రవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా హత్య కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని నరసన్న పల్లి గ్రామ శివారులో  గత నెల 30న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదురు కవిత (44) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకు చీరతో ఉరివేసి దారుణ హత్య కు  పాల్పడ్డారు.

ఈనెల 01న ఆమె భర్త గంగారెడ్డి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్ ,దేవనపల్లి ఎస్త్స్ర గూడెం రాజు ఆధ్వర్యంలో విచారణ లో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించారు.

సాంకేతిక సహాయంతో దోమకొండ మండలం చింతమన్ పల్లికి చెందిన జంగంపల్లి మహేష్ అనే పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో కవిత హత్య కేసు కొలిక్కి వచ్చి నట్లు తెలిపారు. జంగంపల్లి మహేష్ పై ఇదివరకు భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఉంది, ఆ కేసులో బెయిల్ కొరకు చిదురు కవిత వద్ద మహేష్, రూ.లక్ష అప్పు తీసుకున్నాడు.

ఇటీవల కాలంలో అప్పు తిరిగి చెల్లించాలని కవిత ఒత్తిడి తేవడంతో ఆమె ను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈనెల 30న కవిత వ్యవసాయ భూమి వద్దకు వస్తే డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికాడు. అక్కడికి వచ్చిన కవిత ముక్కుపై బలంగా చేతితో గుద్దడంతో ఆమె కింద పడిపోగానే చీర కొంగుతోనే ఉరిబిగించి ఊపిరాడకుండా హత్య చేశాడు.

ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, సెల్ ఫోన్ ను తీసుకొని పరారయ్యాడు. శుక్రవారం జంగంపల్లి మహేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, అతని వద్ద నుంచి బంగారు కమ్మలు రెండు మాటీలు రెండు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును 48 గంటల్లో చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులు క్రైమ్ టీం సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. రూరల్ సీఐ రామన్, ఐటి సీఐ శ్రీనివాస్ దేవునిపల్లి ఎస్‌ఐ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.