29-07-2025 02:07:08 AM
ఆలయానికి రూ. 13 లక్షల ఆదాయం
చేర్యాల, జులై 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సీల్ కం బహిరంగ వేలం పాట లు నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముకొని లైసెన్ హక్కు పొందడానికి వేలంపాట నిర్వహించారు. ఇప్పటికే పలు ద పాలు వేలంపాట నిర్వహించినప్పటికీ సరైన పాట రాకపోవడంతో అనేకమార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు వేలం పాటను పూర్తి చేశారు.
ఈ వేలం పాటలో అయినా పూర్ గ్రామానికి చెందిన మల్లం శ్రీనివాస్ 13 లక్షలు పాట పాడి టెండర్ను దక్కించుకున్నారు. ఈ వేలం పాటతో ఆలయానికి సంబంధించిన అన్ని వేలం పాటలు పూర్తయ్యాయి. వేలం పాట పాడిన వారు వచ్చే నెల ఒకటో తారీకు నుంచి సంవత్సరం పాటు షాపును నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఈ వేలం పాటలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి అన్నపూర్ణ, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, శ్రీరాములు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.