29-07-2025 02:02:00 AM
కొత్తకోట జులై 28 : శితిలావస్థలో చేరిన పాఠశాల భవనం, ఎప్పుడు ఏ క్షణాన ఏమైతుందో తెలియని పరిస్థితి, సుమారు 30, 40 సంవత్సరాలు నిర్మించిన పాఠశాల భవ నం, శితిలావస్థలో చేరి పై పెచ్చులుడి ప్ర మాదకరంగా మారింది. గత 4, 5 సంవత్సరాల నుండి భవనం శితిలావస్థలో చేరింది నూతన భవనంలోకి మార్చేందుకు సహకరించాలని పాఠశాల ఉపాధ్యాయులు తిరిగ ని చోటు లేదు, కలవని నాయకుడు లేడు, అయిన మోక్షం లభించలేదు.
ఎట్టకేలకు కానాయపల్లి గ్రామానికి చెందిన రావుల కర్ణాకర్ రెడ్డి ముందుకు రావడంతో పాఠశాల తరలింపుకు మోక్షం లభించింది. ప్రా రంభోత్సవానికి అన్ని హంగులతో సిద్ధమవుతుంది. రేపో ఎల్లుడో ప్రారంభం కానుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాల దుస్థితి. పాఠశాల శితిలావస్థలో చేరి సుమారు 7, 8 ఏండ్లు కావస్తుంది.
అప్పటి నుండి విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పె ట్టుకొని విద్యను అభ్యసిస్తున్నారు. కొన్నిసార్లు పై పెచ్చులుడిన సంఘటనలు లేకపో లేదు. వర్షాకాలంలో వర్షపు నీరు భవనంపై నిల్వ చేరి రూమ్ లల్లో నీరు కారేది. దింతో భవనం మొట్ట మెత్తభారీ ప్రమాదకరంగా శితిలావస్థకు చేరింది. ఈ పరిస్థితినీ చూసిన విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి వెనకడుగు వేసి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపారు.
పాఠశాల పని తీరు ఇలా ఉంది
కానాయపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు విద్య ఉంది. మొత్తం 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం శితిలావస్థలో ఉన్నందుకు చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపలేకపోన్నారనీ తెలుస్తుంది. కావా ల్సినంత ఉపాధ్యాయ బృందం ఉన్నప్పటికీ భవనం బాలేక విద్యార్థుల సంఖ్య తగ్గేది, ఈ ఏడాది బడిబాటలో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు రావడానికి మొ గ్గు చూపారు.
ఫ్రీ ప్రైమరీ తరగతి ప్రారంభం
వనపర్తి జిల్లాలోనే మొట్టమొదటి ఫ్రీ ప్రైమరీ పాఠశాల కానాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ పాఠశా లను ప్రారంభించాలని అన్ని పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా బడిబాటలో ఉపాధ్యాయులు 16 మంది విద్యార్థులను ఫ్రీ ప్రైమరీ లో చేర్చేందుకు ఎన్రోల్మెంట్ చేశారు. పాఠశాల భవ నం సరిగ్గా లేక విద్యార్థులు రాలేకపోయారు. కొత్త భవనం ఈ ఫ్రీ ప్రైమరీ తరగతిని ప్రారంభించానున్నారు.
పుట్టిన ఊరికి మంచి చేయలే
పుట్టిన ఊరికి ఏదోకటి మంచి పని చే యాలనే లక్ష్యంతో గ్రామ అభివృద్ధిలో భాగ ంగా నూతన పాఠశాలలోకి మార్చేందుకు నా వంతు సహకారం చేశాను. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల తరలించేందుకు కావాల్సిన సదుపాయాలు కల్పించాను.
నూతనం గా నిర్మిం చిన భవనానికి పెయింటింగ్ వేయించాను, ప్రాంగణంలో నూతన బోర్ మోటర్ తవ్వించాను, గ్రౌండ్లో మట్టిదిబ్బలను తొలగించి చ దును చేయించాను, కరెంట్ పనులు, మూ త్రశాలలు, మరుగుదొట్లు, పెండింగ్ పనులు పూర్తి చేయిం చాను. పాఠశాలలో ఉండే అన్ని సదుపాయాలు కల్పించాను. మా గ్రామానికి ఒక మంచి చేసినందుకు సంతోషంగా ఉంది.
పునరావాసంలో కొత్త పాఠశాల
కానాయపల్లి గ్రామం శంకర సము ద్రం రిజర్వాయర్ కింద ముంపునకు గురైంది. అప్పటి నుండి ఇప్పటి దాక గ్రా మంలో ఉన్న పాఠశాల మరమ్మత్తులకు నోచుకోలేదు. పునరావాస కేంద్రం లో మౌలిక వసతులు కల్పించే క్రమం లో బిఆరెస్ ప్రభుత్వం పాఠశాల ఏర్పా టు చేయాలనీ 43లక్షల 50 వేలు నిధు లు మంజూరు అయ్యాయి. పాఠశాల భవనం పూర్తి అయిన కూడా గ్రామం నుండి తరలించడానికి అనేక అడ్డంకులు వచ్చాయి.
పాఠశాల పరిస్థితినీ భట్టి ఉ పాధ్యాయులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు అం దజేసిన ఫలితం మాత్రం శూన్యం, కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్నీ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూ దన్ రెడ్డి దృష్టికి ఉపాధ్యాయు లు, గ్రామ నాయకులు తీసుకెళ్లారు. పాఠశాల తరలింపుకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూ దన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రా మ నాయకులు ముందుకు వచ్చి అన్ని వనరులు సమకూర్చారు, అలాగే గ్రా మం నుండి కొత్త పాఠశాల వరకు ప్రైవే ట్ బస్సు సౌకర్యం కూడా కల్పించారు.
అభిప్రాయం.. రావుల కరుణాకర్ రెడ్డి. గ్రామ వాసి,
దాతల సహకారం మరువలేనిది
గ్రామంలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోదించాలంటే భయ మేసేది. పై కప్పు ఎప్పుడు కులుతుందో అనే భయం ఉండేది. కొత్త భవనంలోకి మార్చేందుకు ఎంతో మంది అధికారు లు, ప్రజాప్రతినిధుల దగ్గరకు తిరిగిన సమస్య పరిస్కారం కాలేదు. గ్రామ నా యకుని సాయం ద్వారా నూతన భవనంలోకి మార్చడానికి అన్ని సదుపా యాలు కల్పించారు.
ఈ ఏడాది నుండే కొత్త భవనంలో ఫ్రీ ప్రైమరీ తరగతిని ప్రారంభిస్తున్నాం. అందుకు అవసరమై న పుస్తకాలు కూడా ఈయనే ఇప్పిస్తా అని మాట ఇచ్చారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పాఠశా లకు తరలించేందుకు కృషి చేసిన గ్రామ నాయకునికి, దేవరకద్ర ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదములు.
రాజు కుమార్ ఉపాద్యాయుడు