calender_icon.png 3 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర భక్తి గీతాల ఆడియో ఆవిష్కరణ

02-11-2025 06:34:27 PM

యువత అన్ని రంగాల్లో రాణించాలి.. సిఐ కరుణాకర్

రేగొండ (విజయక్రాంతి): శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా రూపొందించిన భక్తి గీతాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. గజనపురం సీఐ(CI) కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా ఈ ఆడియోను ఆవిష్కరించారు. తిరుమలగిరి గ్రామస్తుడైన వడాల శ్రీనివాస్ రెడ్డి ఈ భక్తి గీతాలను రచించి, స్వయంగా గానం ఆలపించడం విశేషం. వడాల బ్రదర్స్ ఆధ్వర్యంలో మొత్తం రెండు భక్తి గీతాలను స్వామివారికి సమర్పించారు.బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రాంగణంలో, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ, యువకులు ఏదో ఒక కలను (నైపుణ్యాన్ని) కలిగి ఉండాలని, యువత అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భక్తి గీతాలను ఆలపించిన వడాల శ్రీనివాస్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై కె. రాజేష్, బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణారెడ్డి, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, యాత్ర మాజీ చైర్మన్లు కట్ల మధుసూదన్ రెడ్డి, రొంటాల వెంకటస్వామి, తిరుమలగిరి మాజీ ఉపసర్పంచ్ సుంకరి మనోహర్, ఆలయ అర్చకులు కూర్మాచలం వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ లక్కం రాములు, రొంటాల రఘుపతి, సుంకరి శ్రీధర్, సిరంగి కిరణ్, గంగాధరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.