calender_icon.png 3 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవీన్ యాదవ్ గెలుపుతో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం

02-11-2025 06:32:00 PM

జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్..

రామగుండం (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుతో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ గడప గడపకు ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను నియోజకవర్గ ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల ఆశయాలకు తగిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. పార్టీ అభ్యర్థిని ఘన విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.