క్లీన్‌స్వీప్‌తో ఆస్ట్రేలియా ప్రతీకారం
మూడో వన్డేలోనూ భారత్ మహిళల ఓటమి
హోబార్ట్ , మార్చి 1 : ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్‌లో మా త్రం ఘోరపరాభవం ఎదురైంది. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారంగా కంగారూలు వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్ మూడో వన్డేలో185 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హోబార్ట్ వేదికగా జరిగిన చివ రి వన్డేలో ఆసీస్ బ్యాటర్లు దుమ్మురేపారు.
ఓపెనర్ అలీసా హీలీ, బెత్ మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ సెంచరీలతో రెచ్చిపోయారు. లిచ్ ఫీల్ 14 పరుగు లకే ఔటైనప్పటకీ జార్జియా వోల్‌తో కలిసి హీలీ 104 పరుగులు, బెత్ మూనీతో కలిసి 145 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పింది. ఈ క్రమంలో కెప్టెన్ అలీసా హీలీ 98 బం తుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 158 పరుగులు చేయగా.. మరింత దూకుడుగా ఆడిన బెత్ మూనీ 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులతో చెలరేగింది.
చివర్లో అన్నా సదర్లాండ్, నికోలస్ క్యారీ కూడా ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 409 పరుగు ల భారీస్కోరు చేసింది. భారత బౌ లర్లలో శ్రీచరణి, స్నేహ్ రాణా రెం డేసి వికెట్లు, రేణుక సింగ్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. అనంతరం భారత జట్టు పెద్దగా పోటీనివ్వలేకపోయింది.
స్మృతి మంధాన డకౌటవగా.. ప్రతీకా రావల్ 27, హర్మన్ ప్రీత్ కౌర్ 25, హ్యార్లిన్ డియోల్ 14, దీప్తి శర్మ 29, రిఛా ఘోష్ 18 పరుగులకే ఔటయ్యారు. జెమీ మా రోడ్రిగ్స్ 20 బంతుల్లో 9 ఫోర్లతో 42 రన్స్ చేయగా.. స్నేహ రాణా 44 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాట ర్లు ఫెయిలవడంతో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో అలాన కింగ్ నాలుగు వికె ట్లతో భారత్ పతనాన్ని శాసించింది.




