Alyssa Healy Retires After 16-Year Career, Signs Off with 158 in Emotional Farewell vs India
కెరీర్ ముగించిన అలీసా హీలీ
హోబార్ట్, మార్చి 1 : మహిళల క్రికెట్ లో సుధీర్ఘ కాలం కొనసాగడం అంత ఈజీ కాదు. ఎందుకంటే గాయాలను తట్టుకుని, ఫిట్ నెస్ కాపాడుకుంటూ 16 ఏళ్ల పాటు ఆడడం అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి అరుదైన ఘనత ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీకే దక్కుతుంది. మహిళల క్రికెట్‌లో దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఆమె తన క్రికెట్ కెరీర్ ను సగర్వంగా ముగించింది.
భారత్‌తో సొంతగడ్డపై జరిగే సిరీసే తనకు చివరిదని ముందే ప్రకటించిన హీలీ మూడో వన్డేలో అద్భుత శతకం సాధించింది. 158 పరుగులతో ఆసీస్ భారీస్కోరు సాధించడంలో తనదైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఫేర్ వెల్ మ్యాచ్ కావడంతో భారత క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. అలీసా హీ లీ భర్త , ఆసీస్ పేసర్ స్టార్క్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా మ్యాచ్‌కు హాజరయ్యారు. దీంతో ఒకవిధమైన ఉద్వేగపూరితమైన వాతావరణం నెలకొంది.
ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రి కెట్లో అరంగేట్రం చేసింది. 2010లో న్యూజిలాండ్తో సిరీస్‌లో తను తొలి మ్యాచ్ ఆడింది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా జట్టు లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీలీ మూడేళ్ల క్రితం కెప్టెన్సీ చేపట్టింది.
లానింగ్ వారసురాలిగా బాధ్యతలు తీసుకున్న హీలీ 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించింది. 19 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అలీసా హీలీ తన కెరీర్‌లో ఇప్పటి వర కూ 162 టీ20లు, 126 వన్డేలు, 11 టెస్టులు ఆడింది. వికెట్ల వెనుక ఆ మెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చురుగ్గా కదులుతూ టీ20 ల్లో 126 మందిని ఔట్ చేసింది.






