calender_icon.png 2 November, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు ఎగువ నుండి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలి

30-10-2025 01:12:20 AM

- ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలి

- అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్ లో 1077, 9063211298 టోల్ ఫ్రీ నెంబర్

- ఖమ్మం నగరం, పెద్దతండా మున్నేరు పరివాహక ప్రాంతాలలో పర్యటించి ఎగువ నుంచి ప్రవహించే వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో ము న్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు. మొంథా తూఫాను ప్రభావంతో మున్నేరు నది పరివాహక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తల కోసం బుధవారం ఖమ్మం నగరంలోని కా ల్వఒడ్డు, మున్నేరు ఘూట్, గణేష్ నిమర్జన ఘూట్, బొక్కలగడ్డ, ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ ఆగ స్త్య తో కలిసి పర్యటించారు. మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని, నీటిమట్టం స్థాయిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మున్నే రు పరిసర ప్రాంతాలు బొక్కలగడ్డలో స్ధానిక ప్రజలతో కలెక్టర్ ముచ్చటిస్తూ, భారీ వర్షాలతో ఎగువ జిల్లాల నుండి మున్నేరు వరద పెరుగుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సహకరించాలని, వరద ఎప్పటికప్పుడు గమనించుకోవాలని సూచించారు. మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్న దృ ష్ట్యా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మొంథా తూఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో ము న్నేరుకి వరద ముప్పు పెరుగుతుందని, ప్ర స్తుతం ఖమ్మం వద్ద మున్నేరు 17 అడుగుల మేర ప్రవహిస్తోందని మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వే స్తున్నామని తెలిపారు. అధికార యంత్రాం గం అంతా అప్రమత్తంగా ఉన్నామని, ఎలాం టి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రజలు అనవసరంగా ముంపు ప్రాంతాల్లో తిరగవద్దని కోరారు.

వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అ ధికారులతో పూర్తి సంసిద్ధతతో స్థానికంగా ఉంటూ మరింత అప్రమత్తంగా ఉండాలన్నా రు. నీటిపారుదల, రెవెన్యూ, పంచాయ తీ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచ నా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున మున్నేరు నది, బ్రిడ్జి ల పైకి ప్రజలు అనవసరంగా రావద్దని, ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భం గా కలెక్టర్ వెంట ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ అనిల్ కుమా ర్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.